Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీకి చెందిన భారీ విమానం.. అంతర్జాతీయ స్థాయిలో కలకలం

US military aircraft lands in Russia causing international stir
Advertisement
  • మాస్కోలో ల్యాండ్ అయిన బోయింగ్ సీ-17 ఏ గ్లోబ్ మాస్టర్ III విమానం
  • రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఊహించని పరిణామం
  • అమెరికా సైనిక విమానంపై తమకు ముందస్తు సమాచారం లేదన్న పుతిన్ అధికార ప్రతినిధి
Advertisement

మాస్కోలోని వ్నుకోవో అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా వైమానిక దళానికి చెందిన భారీ ‘బోయింగ్ సీ-17 ఏ గ్లోబ్‌మాస్టర్ III’ రవాణా విమానం అకస్మాత్తుగా ల్యాండ్ కావడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో, పరస్పరం వైమానిక ఆంక్షలు విధించుకున్న తరుణంలో ఒక అమెరికన్ సైనిక విమానం నేరుగా మాస్కోలో అడుగుపెట్టడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఫ్లైట్‌ట్రాకింగ్ వెబ్‌సైట్ 'ఫ్లైట్‌రాడార్24' ఆధారంగా వెల్లడైన వివరాల ప్రకారం... ఈ గ్లోబ్‌మాస్టర్ విమానం మొదట అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్ మిలిటరీ స్థావరం నుంచి బయలుదేరింది. ఆ తర్వాత లాట్వియా రాజధాని రీగాలో ఆగింది. మంగళవారం ఉదయం రీగా నుంచి బయలుదేరిన రెండు గంటల్లోనే రష్యా వాయుసేన అనుమతితో మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ఈ విమానంలో ప్రయాణిస్తున్నదెవరు, దేనికోసం వచ్చిందనేది మొదట మిస్టరీగా మారింది.


ఈ ఆకస్మిక ల్యాండింగ్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ... మాస్కోలో ల్యాండ్ అయిన అమెరికా సైనిక విమానం గురించి తమ వద్ద ఎలాంటి ముందస్తు సమాచారం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఈ వారంలో అమెరికా పాలనా యంత్రాంగ ప్రతినిధులతో ఎలాంటి ముందస్తు సమావేశాలు ఖరారు కాలేదని స్పష్టం చేయడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.


అయితే, అమెరికా మీడియా కథనాల ప్రకారం... అమెరికా నిఘా సంస్థ 'సీఐఏ' డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ రహస్య పర్యటనలో భాగంగా ఈ విమానంలో మాస్కోకు చేరుకున్నట్లు సమాచారం వెలువడింది. రష్యా నిఘా వర్గాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపేందుకే ఆయన అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఖైదీల మార్పిడి ఒప్పందాలు లేదా ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చల సందర్భాల్లోనూ ఇలాంటి రహస్య పర్యటనలు జరిగిన నేపథ్యంలో, ఈ పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే దానిపై అంతర్జాతీయ రాజకీయ వేదికలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement
Boeing C-17A Globemaster III
US Air Force
Moscow Vnukovo Airport
John Ratcliffe
CIA Director Russia visit
Russia Ukraine war tension

More Telugu News